కేసీఆర్ గాయంపై ఆవేదనగా స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ🙏💐
- Suresh D
- Dec 8, 2023
- 1 min read
ఫాంహౌస్‌లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

ఫాంహౌస్‌లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. కేసీఆర్‌కు అయిన గాయం గురించి తెలిసి చాలా బాధపడినట్టు తెలిపారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.గాయపడిన కేసీఆర్‌ను నిన్న యశోద ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన తుంటి ఎముక రెండుచోట్ల విరిగినట్టు గుర్తించారు. 11 గంటలకు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్టు తెలిపారు. విరిగిన తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెప్తున్నారు. 🙏💐