నేటి నుంచి ఐపీఎల్ టికెట్ల విక్రయం 🏏
- Shiva YT
- Mar 18, 2024
- 1 min read
ఐపీఎల్-17వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ఎంఎ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు సీఎస్‌కే-ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లను నేటి నుంచి విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.1700 నుంచి రూ.7500 వరకు ఉన్నాయి. పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది. 🎟️🕢