ఐపీఎల్ 2024లో తుఫాన్ ఇన్నింగ్స్..ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..?
- Suresh D
- Apr 19, 2024
- 1 min read
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ దుమ్మురేపుతున్నాడు. లేటు వయసుల్లో లేటెస్ట్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయకంపితులు చేస్తున్నాడు. తుపాన్ బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గత రెండు మ్యాచుల్లో మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించేందుకు వీరుడిలా ప్రయత్నించాడు. మ్యాచ్ ఓడినా.. డీకే పోరాటానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన దినేశ్ కార్తిక్.. 226 రన్స్ చేశాడు. 200లకు పైగా స్ట్రైక్ రేటుతో ఈ పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగుల వీరుల్లో టాప్-10లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు RCBలో నిలకడగా రాణిస్తూ.. ఫ్యాన్స్‌తో జేజేలు కొట్టించుకుంటున్నాడు. ముఖ్యంగా సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో దినేశ్ కార్తిక్ పోరాటం న భూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉంది. 38 ఏళ్ల దినేశ్ కార్తిక్.. 35 బంతుల్లో 83 రన్స్ చేశాడు. ఈ మ్యాచులో డీకే ఔట్ అయ్యాక.. చిన్నస్వామి స్టేడియంలోని అభిమానులు అంతా అతడికి స్టాడింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సీజన్‌లో 108 మీటర్ల భారీ సిక్స్ కొట్టిన డీకే.. IPL 2024లో లాంగెస్ట్ సిక్స్‌ను నమోదు చేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ బెర్తు కోసం బలమైన కాంపిటేటర్‌గా మారాడు. దినేశ్ కార్తిక్ ఫామ్ చూసిన అభిమానులు.. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జోరు డీకే కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు.