వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ వాయిదా.. ఎందుకో చెప్పిన రామ్గోపాల్ వర్మ ✨🎞️
- Suresh D
- Feb 23, 2024
- 1 min read
వ్యూహం, శపథం సినిమాల విడుదల వాయిదా పడింది. కొత్త తేదీలను కూడా దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. ఎందుకు వాయిదా వేశారో కూడా వెల్లడించారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమా రిలీజులు మళ్లీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి రూపొందించిన ఈ మూవీస్ రిలీజ్ డేట్లు ఇది వరకే ఫిక్స్ అయ్యాయి. వ్యూహం సినిమాను ఫిబ్రవరి 23, శపథం మూవీని మార్చి 1న తేదీన రిలీజ్ చేస్తామాని ఆర్జీవీ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పుడు రెండు సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం సినిమాలను విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అయితే వ్యూహం సినిమా రిలీజ్కు కొన్ని గంటల ముందే తమ సినిమాల రిలీజులను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా వ్యూహం, శపథం సినిమాల రిలీజ్ డేట్లతో ఒక కొత్త పోస్టర్ ను పంచుకున్నారు ఆర్జీవీ. కొన్ని సాంకేతిక కారణాలు, మరింత ఎక్కువగా ప్రమోషన్లు చేసేందుకే తమ సినిమాలను వాయిదా వేసినట్లు ట్వీట్ చేశారాయాన. థియేటర్లు దొరకడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు.
‘వ్యూహం సినిమాను మార్చి 1కి, శపథం మూవీని మార్చి 8కి వాయిదా వేశాం. అయితే, ఈసారి లోకేశ్ మాత్రం కారణం కాదు. కొన్ని సాంకేతిక కారణాలు, మరిన్ని ప్రమోషన్లను చేయాలనుకోవడం, ఆ తేదీల్లో మేం అనుకున్న థియేటర్లు దొరుకుతున్నందు వల్ల వాయిదా వేశాం’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వ్యూహం, శపథం సినిమాలను తెరకెక్కించారు ఆర్జీవీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో రంగం ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుండగా, ధనుంజయ్ ప్రభునే, పద్మావతి, రేఖా నిరోశా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు.
కాగా ఇవాళ థియేటర్లలో సుందరం మాస్టార్, సైరన్, సిద్ధార్థ్ రాయ్, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా తదితర సినిమాలు రిలీజ్ కానున్నాయి.✨🎞️