చిరంజీవి చేతుల మీదుగా రామ్‌చరణ్ 16🎥✨
- Suresh D
- Mar 20, 2024
- 1 min read
Updated: Mar 21, 2024
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 16వ మూవీ ఇది. బుధవారం ఈ సినిమా అఫీషియల్‌గా మొదలైంది. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సినిమా మొదలైంది. పూజా కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు. ఆర్‌సీ 16 లాంఛింగ్ ఈవెంట్‌లో జాన్వీకపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చీరకట్టులో సందడి చేసింది.🎥✨