సుహాస్- కీర్తి సురేష్.. ఇదెక్కడి కాంబో🤔
- Suresh D
- Mar 20, 2024
- 1 min read
Updated: Mar 21, 2024
సినిమాల్లో కొన్ని కాంబోలో అస్సలు ఊహించలేం. అలాంటి ఓ కాంబినేషన్‌యే ఇది. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ త్వరలోనే కీర్తి సురేష్‌తో నటించబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబోలో 'ఉప్పు కప్పురంబు' (uppu kappurambu) అనే సినిమా రాబోతుంది. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ తన ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఒరిజినల్ మూవీ ఇది. అనిల్ ఐవి శశి దర్శకత్వంలో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాధికా లావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వసంత్ మురళీకృష్ణ మరింగంటి కథ అందించారు. ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ ఈవెంట్‌లో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక ఉప్పు కప్పురంబు అనేది సెటైరికల్ కామెడీ జోనర్‌లో తెరకెక్కబోతుంది. ఇందులో కీర్తి సురేష్‌కి మంచి పెర్ఫామెన్స్ ఉన్న రోల్ ఆఫర్ చేశారట. అందుకే మహానటి ఒప్పుకుందని సమాచారం.