top of page

రామ్ చరణ్‌ HCA స్పాట్ లైట్ అవార్డ్.. తెరపైకి కొత్త వాదన!


లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన RRR మూవీ రీసెంట్‌గా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో హవా చూపింది. ఇటీవల USAలో జరిగిన కార్యక్రమంలో RRR మూవీ టీమ్‌ ఐదు అవార్డ్స్ అందుకోగా అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక RRR మూవీలో లీడ్ క్యారెక్టర్స్‌లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఈవేదికగా స్పాట్ లైట్ అవార్డ్‌ అందుకోవడం ఆయన అభిమానుల్లో జోష్ నింపింది. ఈ మేరకు సినీ రాజకీయ ప్రముఖులు సహా ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక వేత్తలు సైతం చరణ్‌కు కంగ్రాట్స్ తెలియజేశారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ ,నాగ బాబు తదితరులు కూడా ప్రత్యేకంగా చరణ్‌ను మాత్రమే అభినందించి, ఎన్టీఆర్ పేరును విస్మరించడం నెట్టింట వివాదానికి దారితీసింది.


విషయానికొస్తే.. HCA ఈవెంట్‌లో స్పాట్‌లైట్ అవార్డ్‌ను RRR టీమ్‌లో అందరికీ ప్రజెంట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఈ అవార్డ్ కేవలం చరణ్‌కు మాతమ్రే వచ్చినట్లుగా చిత్రీకరించబడింది. పైగా ఎక్కడ కూడా ఎన్టీఆర్ పేరు ప్రస్తావన రాకపోవడం ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఓ వైపు మెగా ఫ్యాన్స్ ఏమో తమ హీరోకు అవార్డు రావడం పట్ల ఇండస్ట్రీ మొత్తం కుళ్లుకుంటోందని కామెంట్స్ చేస్తుండగా.. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ రిటార్ట్ ఇస్తున్నారు.


నిజానికి ఈ అవార్డ్.. రామ్ చరణ్‌కే కాకుండా RRR మూవీలోని నటీనటులు, సిబ్బందిలోని ప్రతి కీలక సభ్యునికి ఇవ్వబడిందని సమాచారం. అయితే రామ్ చరణ్ అక్కడే ఉన్నందున స్వయంగా అవార్డ్ అందుకున్నాడు తప్ప మరోటి కాదు. నెక్స్ట్ రౌండ్ RRR మూవీ ప్రమోషన్స్ కోసం USA వెళ్లినపుడు ఎన్టీఆర్‌కు ప్రదానం చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఇదే విషయాన్ని RRR మూవీ హ్యాండిల్ కూడా తన ట్వీట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేవలం చరణ్‌ ఒక్కడికే అభినందనలు తెలుపుతున్న, తెలిపిన పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు ఇప్పుడైనా ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 
 
bottom of page