top of page

🙏 అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ..

🇮🇳 భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.

ree

దేశరాజధాని ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో దివంగత నేత సమాధి వద్ద ప్రధాని, రాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా కౌట్ భట్టాచార్య, బండి సంజయ్‌ వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఎన్డీయే నేతలు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు.

🌹 అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వాజ్‌పెయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి చెందిందన్నారు. దేశాభివృద్ధికి ఆయన గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ.


 
 
bottom of page