కృష్ణంరాజుకి మొదటి భార్య అంటే ఎనలేని ప్రేమ.. మా పెళ్లి ఎలా జరిగిందంటే?-శ్యామలా దేవీ ఇంటర్వ్యూ 🎥✨
- Suresh D
- Jan 25, 2024
- 1 min read
ఒకప్పటి తరం నటుల్లో అగ్ర తారగా వెలుగొందారు కృష్ణం రాజు. టాలీవుడ్ రెబల్ స్టార్‌గా ముద్ర పడ్డ ఆయన.. 180కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్.. కృష్ణం రాజు సోదరుడు కుమారుడు అన్న సంగతి విదితమే. అంటే ప్రభాస్‌కు పెద్దనాన్న. పశ్చిమ గోదావరి జిల్లా మెగల్తూరులో పుట్టిన కృష్ణం రాజు, రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్‌పై పలు సినిమాలు తెరకెక్కించారు. 2022లో సెప్టెంబర్ 11న ఆయన తుది శ్వాస విడిచారు. జనవరి 20వ తేదీ ఆయన జయంతి సందర్భంగా సతీమణి శ్యామలా దేవీ పలు విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నారు.🎥✨









































