top of page

టాలీవుడ్ లో విషాదం..🎞️😢

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కన్నుమూస్తుండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ree

ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే.. తాజాగా సినీ, జానపద నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో వడ్డేపల్లి శ్రీనివాస్  బాధపడుతున్నారు. కాగా నిన్న సికింద్రాబాద్ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో సాంగ్ తో వడ్డేపల్లి పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన “గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” పాటను ఆలపించారు. ఈ పాటతో ఆయనకు ఫిలిఫేర్ అవార్డు కూడా వచ్చింది.వడ్డీపల్లి ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. . దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు వడ్డేపల్లి. వడ్డేపల్లి ,మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. అలాగే ఆయన మృతికి సినీ, జానపద కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


 
 
bottom of page