top of page

30ఏళ్లుగా మెగాస్టార్‌కు డూప్‌గా నటిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..?🎞️🎥

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నారు చిరు. ఇటీవలే భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు విశ్వంభర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగాస్టార్. అయితే అప్పటి హీరోలు చాలా మంది డూప్ లను పెట్టుకునే వారు. యాక్షన్ సీన్స్‌లో రిస్కీ షాట్స్‌లో డుప్స్ ను వాడుతుంటారు. అయితే చిరంజీవికి దాదాపు 30 ఏళ్లుగా డూప్ గా నటిస్తున్న వ్యక్తి గురించి మీకు తెలుసా..? ఒకటికాదు రెండు కాదు పదుల సంఖ్యలో సినిమాల్లో ఓ వ్యక్తి చిరంజీవికి డూప్ గా నటిస్తున్నారు.

ree

చిరంజీవికి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. పశ్చిమ గోదావరికి చెందిన ప్రేమ్ కుమార్ . సొంతంగా ఓ రికార్డింగ్ డాన్స్ కంపెని పెట్టుకున్నాడు. అచ్చం చిరంజీవి ఆహార్యంలో ఉండే ప్రేమ్ కుమార్.. చాలా సినిమాల్లో చిరంజీవికి డూప్ గా నటిస్తున్నా అని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ్ కుమార్. దాదాపు 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా నటిస్తున్నా అని తెలిపాడు ప్రేమ్ కుమార్.

చిరంజీవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. వశిష్ఠ గతంలో కళ్యాణ్ రామ్ తో కలిసి బింబిసార అనే సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు చిరంజీవితో కూడా వశిష్ఠ ఇదే తరహా సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లాంటి సినిమాను వశిష్ఠ తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారట.. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.🎞️🎥

 
 
bottom of page