ఓటీటీల్లోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ పూర్ థింగ్స్ .. ఎక్కడ చూడాలంటే?✨🎞️
- Suresh D
- Feb 21, 2024
- 1 min read
హాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ పూర్ థింగ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
పూర్ థింగ్స్ మూవీ 2023లో రిలీజైంది. గతేడాది టాప్ 10 హాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా ఈ మూవీని అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ ద నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ ఎంపిక చేసింది. గోల్డెన్స్ గ్లోబ్స్ లో రెండు, బాఫ్టాల్లో ఐదు అవార్డులు గెలుచుకున్న ఈ మూవీ.. ఆస్కార్స్ లో 11 నామినేషన్లను సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ ప్లస్ లు వచ్చే మంగళవారం (ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నాయి.
ఈ పూర్ థింగ్స్ మూవీ గతేడాది సెప్టెంబర్ 1, 2023న 80వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ గోల్డెన్ లయన్ గెలుచుకుంది. ఇక గతేడాది డిసెంబర్ 8న అమెరికాలో, జనవరి 12న యూకేలో రిలీజైంది.
అయితే ఈ పూర్ థింగ్స్ మూవీ రెండు ఓటీటీల్లోకి వస్తున్నా ప్రస్తుతానికి రెంట్ కిందే అందుబాటులో ఉంది. అంటే మూవీ చూడాలంటే ఆ ఓటీటీలు డిమాండ్ చేసే మొత్తం చెల్లించాలి. ఫ్రీగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నది ఇంకా చెప్పలేదు. ఎమ్మా స్టోన్, మార్క్ రఫాలో, విలెమ్ డాఫో, రామీ యూసెఫ్ లాంటి వాళ్లు ఇందులో నటించారు.✨🎞️








































