top of page

పవన్‌ కల్యాణ్‌ నయా లుక్‌.. ఓజీకి లైన్‌ క్లియర్ అయినట్టేనా.?


ree

పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉన్నారు. అంత బిజీలోనూ ఆయన సినిమాల గురించి ఆలోచిస్తున్నారా.?

ree

వై నాట్‌.. ఇప్పుడు ఆయన లుక్‌ని చూసిన ఎవరైనా.. ఆయన మనసులో సినిమాలకున్న స్థానం ఏంటో చెప్పకనే చెప్పగలరు.. మా ఓజీ సిద్ధమవుతున్నారంటూ ఓపెన్‌గా డిక్లేర్‌ చేసేయగలరు.!

ree

వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తూఫానూ కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.. అంటూ హంగ్రీ చీతా ఓజీ గ్లింప్స్ లో సినిమా మీద హైప్స్ ని అమాంతం పెంచేశారు సుజీత్‌.

ree

ఓజీ లుక్‌లోనే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆయన రీసెంట్‌ లుక్‌ని గమనించిన వారందరూ త్వరలోనే ఓజీ షూటింగ్‌లో పాల్గొంటారని ఆనందిస్తున్నారు.

ree

పుట్టినరోజు పూర్తయ్యాక, దసరా వేడుకలు కూడా మొదలయ్యాక ఓజీ సినిమాకు కాల్షీట్‌ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట పవర్‌స్టార్‌. రీసెంట్‌గా ఆయన్ని కలిసిన ప్రొడ్యూసర్స్ తోనూ ఈ విషయాన్నే చెప్పారని టాక్‌.

ree

ముందు ఓజీ, ఆ తర్వాత హరిహరవీరమల్లు షెడ్యూల్స్ పూర్తి చేస్తారు పవర్‌స్టార్‌. ఈ సినిమాలు రెండూ పూర్తయ్యాకే ఆయన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సెట్స్ కి హాజరయ్యేది.

ree

ప్రస్తుతం మిస్టర్‌ బచ్చన్‌ ప్రమోషన్లతో బిజీగా ఉన్న హరీష్‌.. అప్పటికి కాసింత ఖాళీ చేసుకుని, స్క్రిప్ట్ ని మరోసారి సరిచూసుకుని.. రెడీ బాస్‌ అనడానికి సమయం సరిగ్గా సరిపోతుంది.

 
 
bottom of page