ఓటీటీలోకి ధనుష్ ‘రాయన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
- MediaFx

- Aug 16, 2024
- 1 min read
తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా ధనుష్ దర్శకత్వం బాగుందని కితాబు ఇస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఆగష్టు 23 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్‌లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్’ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషించారు.












































