top of page

ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ ఆయిన సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ 🎬

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సంపూర్ణేష్ బాబు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు సంపూర్ణేష్ బాబు.

ఇటీవలే మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కింది మార్టిన్ లూథర్ కింగ్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్టోబర్ 27, 2023న సినిమా థియేటర్లలో విడుదలైంది ఈ మూవీ. ఇక ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది మార్టిన్ లూథర్ కింగ్. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది మార్టిన్ లూథర్ కింగ్. నవంబర్ 29 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. 🎥

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page