🎉 ఎన్టీఆర్ స్మారక కేంద్రీకరణోత్సవం! 💰
- Shiva YT
- Aug 28, 2023
- 1 min read
🔸 విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకి జాతీయ గుర్తింపు దక్కింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. 👏🌹

🤝 ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు అవ్వరు. 🤝🌟
🎂 ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని విడుదల చేసింది. రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. 💲💰
📚 దీన్ని ఏదైనా బ్యాంకులో లేదా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ. 4,160 ఉంటుంది. నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా కొనుగోలుదారులకు అందించనున్నారు. 📖📜
🎂 కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్.. స్వయంకృషితో సినీ రాజకీయ రంగాల్లోకి వచ్చి.. తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థానాన్ని చేరుకుని..ఆ తరువాత తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 🙌🎬🎈