యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిన నెట్‌ఫ్లిక్స్..🎥🤯
- Suresh D
- Oct 18, 2023
- 1 min read
ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. కరోనా తర్వాత ఓటీటీలపై మొగ్గు చూపుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అంతర్జాతీయ సంస్థలు సైతం ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాయి. దీంతో కంపెనీల మధ్య పోటీసైతం పెరిగింది. పెరిగిన పోటీ కారణంగా నాణ్యమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది.

ఇదిలా ఉంటే ప్రారంభంలో పెద్దగా లాభాలు ఆశించని ఓటీటీ సంస్థలు ప్రస్తుతం లాభమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే యూజర్లకు వరుస షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మొన్నటికి మొన్న పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మూడవ త్రైమాసికంగా ఏకంగా 6 మిలియన్ల మంది కొత్త సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఈ నేపథ్యంలోనే యూజర్లకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆదాయం పెంపే లక్ష్యంగా సబ్‌స్క్రిప్షన్ చార్జీలు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే వాల్ట్ డిస్నీ ఇటీవల యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ మాత్రం కేవలం పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని విధించింది. ఈ నిర్ణయంతో నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు పెరిగారు.🎥🤯