ఈరోజు ఈ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుత లాభాలు..!🌌💫
- Suresh D
- Oct 18, 2023
- 4 min read
ఈరోజు ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఆయుష్మాన్ యోగం, సౌభాగ్య యోగం ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ఫలితంగా మేషం, మిధున రాశులతో సహా కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారులు శుభ ఫలితాలను పొందుతారు. మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీరు మీ పనిలో అజాగ్రత్తగా ఉండకూడదు. లేదంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. మీరు ఏదైనా పనికి సంబంధించిన నియమాలు, నిబంధనలకు శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు సన్నిహితుల మద్దతు, గౌరవం లభిస్తుంది. అప్పుడే మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీరు కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తే మంచి లాభాలను పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, మీ వాహనం అకస్మాత్తుగా చెడిపోవచ్చు. దీంతో ఖర్చులు పెరుగుతాయి.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చాలా ఓపికతో పని చేయాలి. ఈరోజు తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. వ్యాపారవేత్తలు కొన్ని కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తే, వాటి నుంచి భారీ లాభాలను పొందుతారు. ఈ సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు.
మిధున రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలొస్తాయి. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, మీ కోరిక నెరవేరుతుంది. మీరు అనవసరమైన కోరికలను నియంత్రించుకోవాలి. లేదంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో బ్యాలెన్స్‌గా ఉండాలి. మీ ఆదాయానికి తగినట్లు బడ్జెట్ రూపొందించుకోవాలి. దీని వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు కొందరి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శ్రీ క్రిష్ణునికి వెన్న, పంచదార, మిఠాయిలు సమర్పించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజ సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనిలో వివేకంతో ముందుకు సాగాలి. మీ పనికి సంబంధించిన రంగాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీ పెద్దల మాటలు విని ఏదైనా పనులు చేస్తే, వారి విని సంతోషిస్తారు. మీ దినచర్యను మెరుగుపరుచుకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి. మీరు స్నేహితులతో కొన్ని వినోద కార్యక్రమాలకు హాజరు కావొచ్చు. విద్యారంగంలో ఉండే వారికి మంచి అవకాశాలొస్తాయి. ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు గోమాతకు మొదటి రోటీ తినిపించాలి.
సింహ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం లభిస్తుంది. మీకు సన్నిహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సంతోష వనరులు కూడా పెరుగుతాయి. మీరు వ్యక్తిగత విషయాల్లో మెరుగ్గా పని చేస్తారు. మీ కుటుంబ సభ్యులు కూడా మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తిని చూసి సంతోషిస్తారు. మీరు చాలా కాలంగా కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, మీ కోరిక నెరవేరుతుంది. మీ ప్రత్యర్థులు కొందరు మీ పనిలో ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధాన చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అందరినీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీరు సామాజిక సమస్యలపై పూర్తి ఆసక్తిని కలిగి ఉంటారు. మీ బద్ధకాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి. లేదంటే మీకు సమస్యలు పెరగొచ్చు. మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావొచ్చు.
ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.
తుల రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు చుట్టూ ఉన్న వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలోని వ్యక్తులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల్లో పని చేసే వ్యక్తులు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. మీరు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీరు ఈరోజు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు అనేక పనులు చేస్తారు. మంచి పేరు సంపాదించుకునేందుకు భాగస్వామ్యంతో కలిసి పని చేయాలి. దీంతో మీపై గౌరవం పెరుగుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీ కళ, నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. మీరు తల్లికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు తులసి చెట్టుకు నీళ్లు సమర్పించి దీపం వెలిగించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు సామాజిక రంగాల్లో పని చేసే వారికి మంచిగా ఉంటుంది. మీ ఆదాయం పరిమితంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా సులభంగా ఖర్చు చేయగలరు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. లేకుంటే మీ సమస్యలు తలెత్తొచ్చు. ఏ పనిలోనైనా చొరవ తీసుకోవడం మానుకోవాలి. మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. ఏదైనా పోటీలో పాల్గొంటే తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు లావాదేవీలలో అలసత్వానికి దూరంగా ఉండాలి. ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
మకర రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీ వాహనాన్ని జాగ్రత్తగా ఉండాలి. మీ ముఖ్యమైన పనులు వేగవంతం అవుతాయి. మీరు స్నేహితులతో సులభంగా ముందుకు సాగాలి. మీరు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందొచ్చు. విద్యార్థులు తమ పరీక్షల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారి స్నేహితులతో మాట్లాడతారు. మీ ప్రత్యర్థులతో కొందరు మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నించొచ్చు. ఈరోజు మీ ప్రభావం, కీర్తి పెరుగుతాయి. ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు గురువు లేదా సీనియర్ల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి.
కుంభ రాశి వారి ఫలితాలు
ఈ రాశి వారు ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు బలోపేతం అవుతాయి. అనుకున్న దాని కంటే ఎక్కువ డబ్బు వస్తే, మీ ఆనందానికి అవధులనేవే ఉండవు. మీరు ఎవరి గాసిప్స్‌లో పాల్గొనకండి. ఎందుకంటే సమస్యలు పెరగొచ్చు. మీరు ముఖ్యమైన పనులలో తొందరపడకండి. లేదంటే సమస్యలు రావొచ్చు. మీరు ఏ ప్రభుత్వ పథకం నుంచి అయినా పూర్తి ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
మీనరాశి
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు కూడా మీకు లొంగిపోతారు. వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్వతంత్ర ఆలోచనలను కలిగి ఉండటం ద్వారా, మీరు ప్రజల ఆలోచనలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. చాకచక్యంతో కొత్త లాభదాయకమైన సంబంధాలను సృష్టిస్తారు. షేర్లు లేదా ఇతర ప్రమాదకర కార్యకలాపాలలో పెట్టుబడి పెట్టడం వల్ల శుభ ఫలితాలు రావొచ్చు. ఈరోజు కొన్ని ప్రయాణాలు అయిష్టంగానే రావొచ్చు. స్నేహితులు, బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ ఇంటి వాతావరణం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ మహిళల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శివుడికి చందనం సమర్పించాలి.