హార్దిక్ పాండ్యాను ఆడుకున్న రోహిత్ ఫ్యాన్స్..
- Suresh D
- Mar 25, 2024
- 1 min read
గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫ్యాన్స్ హల్‌చల్ చేశారు. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. హార్దిక్ పాండ్యా టాస్‌కు వచ్చిన సందర్భంగా.. రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేశారు. పాండ్యా బౌలింగ్ చేసినా.. ఫీల్డింగ్ చేసినా.. నినాదాలు మాత్రం ఆపలేదు. తమ కెప్టెన్ ఎప్పటికీ రోహిత్ శర్మనే అంటూ కొందరు ఫ్లకార్డులు ప్రదర్శించారు. హార్దిక్ పాండ్యాతో పాటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లు టాస్ కోసం క్రీజులోకి వచ్చారు. ఈ సమయంలో కామెంటేటర్ రవిశాస్త్రి హార్దిక్ పాండ్యా పేరు చెప్పగానే.. స్టేడియంలోని చాలా మంది ఫ్యాన్స్.. తమ నిరసన వ్యక్తం చేశారు. ‘బూ’ అని అరుస్తూ.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేయడం తమకు నచ్చలేదనే విషయాన్ని వెల్లడించారు. పాండ్యా గత రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. దీంతో రెండు సీజన్లు తమ జట్టులో ఆడి.. అనూహ్యంగా ముంబై జట్టుకు మారిపోయిన పాండ్యా తీరును నిరసిస్తూ జీటీ ఫ్యాన్స్ సైతం ఇదే రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో హార్దిక్ పాండ్యా కూడా ఒకింత షాక్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచినట్లు తెలియగానే.. రోహిత్ రోహిత్ అంటూ ఫ్యాన్స్ అరవడం మొదలుపెట్టారు. హార్దిక్ పాండ్యా పేరు వినిపించిన ప్రతీసారి రోహిత్.. రోహిత్ అనే నినాదాలు ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా.. తమ కెప్టెన్ ఎప్పటికీ రోహిత్ శర్మనే అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.


Comments