top of page

ఇలాంటి కాల్స్‌ మీకూ వస్తున్నాయా.. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి..!

''హాలో.. మేం ముంబయి క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో ఒక పార్శిల్‌ బుక్‌ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్‌ మైండ్‌ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్‌ అకౌంట్స్‌ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు." అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్‌, తీవ్రవాదులతో బ్యాంక్‌ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్‌ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్‌ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారు.

తాజాగా ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌కి ఫోన్‌ కాల్‌ చేసి అక్షరాల రూ.30 లక్షలను దోచేశారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్‌ అకౌంట్‌ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామంటూ బెదిరించారు. తన లాప్‌ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్‌ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్‌ సెల్స్‌‌తో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. జాయింట్ అకౌంట్‌లో అనుమానస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్‌ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్‌డీ స్కాలర్‌.. సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page