top of page

సినీ నటుడు వడివేలు తమ్ముడు జగదీశ్వరన్ మృతి. 🏥💔

ప్రముఖ సినీ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్ మృతి చెందారు. 55 ఏళ్ల జగదీశ్వరన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.

ree

ప్రముఖ సినీ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు జగదీశ్వరన్ మృతి చెందారు. 55 ఏళ్ల జగదీశ్వరన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధ పడుతున్న ఆయన మధురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతింది. జగదీశ్వరన్ సినిమాల్లో కూడా నటించారు. అయితే అవకాశాలు రాకపోవడంతో మధురైకి వెళ్లిపోయి బట్టల షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. మరోవైపు, ఇటీవలే వడివేలు తల్లి మరణించారు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందే ఆయన తమ్ముడు మృతి చెందారు.💔🙏


 
 
bottom of page