top of page

2,598 మద్యం దుకాణాలకు లైసెన్సులు షురూ చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌✨🍻

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 లిక్కర్ షాపులకు లక్కీ డ్రా సోమవారం (ఆగస్టు 21) విజయవంతంగా ముగిసింది.

ree

పూర్తి పారదర్శకతతో ఎలాంటి సిండికేట్లకు తావులేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ షాపులకు లైసెన్స్‌ కేటాయించామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 🛒👨‍💼

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు చేశారు. ఎవరికీ ఎలాంటి అనుమానం తావులేకుండా ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా అందరికీ తెలిసేలా లాటరీ నిర్వహించినట్టు ఆయన చెప్పారు. 📜💼

దాదాపు లిక్కర్ షాపుల నిర్వహణకు 1,31,970 దరఖాస్తులురాగా 2,598 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో సోమవారం ఎంపిక చేశారు. ఇక 22 మద్యం షాపులకు దరఖాస్తులు తక్కువ రావడంతో వాటిని పక్కన పెట్టారు. లాటరీలో షాపులు పొందిన వారికి మంత్రి అప్పటికప్పుడు ఉత్తర్వులు అందజేశారు. 🎉🏪

 
 
bottom of page