top of page

🌟 తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణం చేసేదెవరు..?

🏛️ తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరపాలని నిర్ణయించుకున్నారట.. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్‌ కోల్పోయిన స్థానిక సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ ను కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి… బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014లో తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్‌ దక్కించుకోవడంతో.. మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. 💪👏


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page