మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ టికెట్ ధరలపై కీలక నిర్ణయం..🌟🎥
- Suresh D
- Aug 6, 2023
- 1 min read
🎬🎞️ఇటీవల పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే భోళా శంకర్ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

🎬🎞️ఇటీవల పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు టికెట్ల ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే భోళా శంకర్ టికెట్ల ధరల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.భోళా శంకర్ సినిమా టికెట్ రేట్లను పెంచకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాబట్టి థియేటర్లలో ప్రస్తుతమున్న ధరలే చిరంజీవి సినిమాకు ఉండనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో భోళా శంకర్ సినిమా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశముంది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుంది. 🎬🎞️