హీరోగా ఎన్టీఆర్ బావమరిది..'మ్యాడ్' మూవీ టీజర్ విడుదల..
- Suresh D
- Aug 31, 2023
- 1 min read
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటుడిగా పరిచయం అవుతున్న 'మ్యాడ్' సినిమా టీజర్ ఈరోజు విడుదలయింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కల్యాణ్ శంకర్ కు కూడా ఇదే మొదటి సినిమా. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె సూర్యదేవర హారిక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు కూడా ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. హారికతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.