కిరణ్ అబ్బవరం పెండ్లికి వేళాయె.. వెడ్డింగ్ డేట్ ఫిక్స్..!
- MediaFx

- Aug 20, 2024
- 1 min read
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసిందే. కిరణ్ అబ్బవరం-నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల నిశ్చితార్థం హైదరాబాద్‍లోని ఓ రిసార్టులో మార్చి 13న ఘనంగా జరిగింది. ఇప్పటికే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఎప్పుడు పెండ్లి పీటలెక్కబోతున్నారని చర్చ నడుస్తోండగా.. వెడ్డింగ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది xతాజా అప్‌డేట్ ప్రకారం ఆగస్టు 22న పెండ్లికి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై కిరణ్ అబ్బవరం కుటుంబసభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించారని తెలిసిందే. తొలి సినిమాతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఫైనల్‌గా ఇద్దరూ ఏడడుగులు వేయబోతుండటంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.












































