top of page

ప్రభాస్‌ హీరోయిన్‌ కోసం క్యూకట్టిన నిర్మాతలు


ree

ప్రభాస్‌ పక్కన కథానాయికగా కొత్తమ్మాయి అనగానే, సోషల్‌మీడియా ఫోకస్‌ అంతా ప్రస్తుతం ఇమాన్వీ ఇస్మాయిల్‌ పైనే. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడ్నుంచొచ్చింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ప్రభాస్‌ పుణ్యమా అని రాత్రికి రాత్రి ఈ అమ్మాయి స్టేటస్‌ మారిపోయింది. తన ఇన్‌స్టాలో ఏకంగా లక్షమంది ఫాలోవర్లు ఒక్కరోజులో పెరిగిపోయారు. శంఖంలో పోస్తేనే కదా తీర్థం అన్నట్టు, ప్రభాస్‌ పక్కన హీరోయిన్‌ అనగానే స్టార్‌ అయి కూర్చుంది ఇమాన్వీ. బడా నిర్మాతలంతా ప్రభాస్‌ సినిమా తర్వాత తమ సినిమాల్లో ఈ అమ్మాయిని నటింపజేయడానికి అప్పుడే ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే.. మైత్రీ మూవీమేకర్స్‌ వాళ్లు మాత్రం తమ సంస్థలో ముందు మూడు సినిమాలు చేసేంతవరకూ ఇతర సినిమాలు ఒప్పుకోకూడదని కండీషన్‌ పెట్టారట ఈ ముద్దుగుమ్మకు. అంతేకాదు, దర్శకుడు అను రాఘవపూడి కూడా తన సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయడానికి వీల్లేదని షరతు విధించారట.

ప్రభాస్‌తో ఆయన చేసే సినిమాకు కథానాయిక ఎవరైనా సరే, బల్క్‌ డేట్లు తనకు అవసరమట. పిలిచినప్పుడల్లా సెట్‌కి రావాల్సి ఉంటుందట. అందుకే బిజీ కథానాయికలను పక్కనపెట్టి ఇమాన్వీని తీసుకున్నారట అను రాఘవపూడి. ఏదేమైనా ఈ అందాలభామ రొట్టె విరిగి నేతిలో పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


 
 
bottom of page