కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్లలోకి వచ్చేది ఆ రోజే 🎥✨
- Suresh D
- Dec 7, 2023
- 1 min read
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. అభిషేక్ నామా నిర్మాత. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగానూ పరిచయం అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'డెవిల్' చిత్రాన్ని తొలుత ఈ ఏడాది నవంబర్ 24న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... నేపథ్య సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ (గ్రాఫిక్స్) వర్క్ పూర్తి కాలేదని, అందువల్ల ముందుగా చెప్పిన తేదీకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం కుదరడం లేదని చిత్ర బృందం వెల్లడించింది. ఈ రోజు కొత్త విడుదల తేదీ ప్రకటించింది.
డిసెంబర్ 29న 'డెవిల్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు వస్తామని అభిషేక్ నామా అనౌన్స్ చేశారు. ఇయర్ ఎండ్‌కు కళ్యాణ్ రామ్ కిక్ ఇవ్వనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట! ఈ ఏడాది ఆఖరులో విడుదల కానున్న పెద్ద తెలుగు సినిమా ఇదేనని చెప్పలి. సంక్రాంతి పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. 'డెవిల్' నుంచి మధ్యలో కొత్త సినిమాలు రావు. రెండు వారాలు కలెక్షన్లు రాబట్టుకోవడానికి థియేటర్లలో ఈ సినిమాకు మంచి అవకాశం లభించిందని చెప్పాలి.🎥✨