జగన్ ఢిల్లీ వ్యూహం బెడిసికొట్టిందా..
- MediaFx

- Jul 25, 2024
- 1 min read
ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించవచ్చని.. తన గురించి చర్చ జరుగుతుందని.. తద్వారా ఏపీలో శాంతి, భద్రతలు అదుపులో లేవనే సందేశాన్ని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడమే లక్ష్యంగా జగన్ కుట్రపూరితంగా ఢిల్లీలో ధర్నా చేశారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా దేశ ప్రజలు గతంలో సీఎంగా చంద్రబాబు పనిచేసిన రోజులను చూశారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ప్రపంచం చూసింది. ఈక్రమంలో లేనిపోని అంశాలను తెరపైకి తెచ్చి.. ప్రభుత్వంపై బురద వేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తున్న ప్రభుత్వం నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే జగన్ కుట్ర పన్నారని.. చివరకు ఆయన వ్యూహం ఫలించలేదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.












































