కిటికీ నుంచి బస్సు ఎక్కుతుండగా గమత్తు ఘటన..
- MediaFx
- Jul 24, 2024
- 1 min read
తాజా ఘటన మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో ఓ విద్యార్థి ఇంటికి వెళ్లేందుకు వేచి చూశాడు. ఇంతలో ఓ బస్సు రానే వచ్చింది. అయితే ఆ బస్సు కోసం అప్పటికే చాలా మంది ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తనకు సీటు దొరకడం కష్టంగా భావించిన సదరు విద్యార్థి ఎలాగైనా సీటు సంపాదించాలనే ఉద్దేశంతో బస్సు మధ్యలోకి వెళ్లి తన బ్యాగును కిటికీలో నుంచి లోపలికి విసిరేశాడు. ఆ తర్వాత తానూ కూడా కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పుడే గమత్తు చోటుచేసుకుంది. ముందుగా కిటికీని రెండు చేతులతో పట్టుకుని కాళ్లు లోపలికి పెట్టాడు. ఆ తర్వాత కిటికీపై అంచు పట్టుకుని లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. అయితే బస్సుకు ఉన్న కిటికీ మొత్తం ఊడిపోయి వచ్చేసింది. దీంతో కిటికీతో పాటు విద్యార్థి సైతం ధబేల్‌మని కింద పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా షాక్ అయ్యారు. కింద ఉన్న కొందరు పరుగుపరుగున అక్కడికి వెళ్లి విద్యార్థిని పైకి లేపారు. కాగా, సదరు విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.