జగన్ బెంగళూరు వెళ్లింది అందుకే: పవన్ కళ్యాణ్..
- MediaFx

- Jul 16, 2024
- 1 min read
అంబానీ పెళ్లిలోనూ జనసేన విజయమే చర్చ: పవన్ కళ్యాణ్ అంబానీ పెళ్లిలోనూ అందరి నోటా ఇదే మాట అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టిడిపి కూటమి విజయానికి ఆనాడు జనసేన తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన క్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి మనిషిని భయపెడుతుంది: జగన్ టార్గెట్ గా ఇదే సమయంలో జనసేనకి తగిలిన ఎదురుదెబ్బలు పరాజయాలను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఒకవేళ ఇదే స్థానంలో ఏ పార్టీ ఉన్న పార్టీని నడిపించేది కాదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్ళిపోయారనీ జగన్ ను టార్గెట్ చేశారు. ఓటమి మనిషిని భయపెడుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో దారుణాలను ప్రస్తావించిన పవన్ గత ప్రభుత్వ హయాంలో ప్రజలు రోడ్డు మీదకి రాలేకపోయారని, ఒక పోస్ట్ పెట్టలేకపోయారని, ఏదైనా మాట్లాడాలంటే కూడా భయంతో ప్రజలు వణికిపోయారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గత వైసిపి పాలనలో జరిగిన దారుణాలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై జరిగిన దాడిని గుర్తు చేశారు. జనసేన విజయానికి ఇదే కారణం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని నారా చంద్రబాబును కూడా జైల్లో పెట్టి 54 రోజులు నరకం చూపించి,ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీలు చేశారన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి జనసేన పార్టీ ఇచ్చిన ధైర్యమే ఈరోజు పార్టీ 100% గెలవడానికి కారణం అన్నారు పవన్ కళ్యాణ్.












































