top of page

#భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక 🌧️


తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రత్యేకంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 10 తర్వాత హైదరాబాద్, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వర్షాలు రోజంతా కొనసాగుతాయని తెలిపింది.

వాతావరణ హెచ్చరిక..



ఏయే జిల్లాల్లో అంటే..

తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు.

 
 
bottom of page