top of page

రెండు రోజులుగా ఏకధాటి వాన.. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి..🌧️

రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. బుధవారం అన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

ree

రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. బుధవారం అన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో వరునుడు ప్రతాపం చూపాడు. మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిశాయి. మెదక్‌ జిల్లాలో 17.8 మి.మీ, సంగారెడ్డి జిల్లాలో 477.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లాలో బుధవారం విస్తారంగా వానలు పడ్డాయి.నెక్కొండలో 76, సంగెం 71 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో 68 మి.మీ, వరంగల్‌ జిల్లా రెడ్లవాడలో 66 మి.మీ, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 65 మి.మీ, ఖానాపురం మండలం మంగళవారిపేటలో 62 మి.మీ, నల్లబెల్లిలో 59 మి.మీ, రాయపర్తిలో 56 మి.మీ, దుగ్గొండిలో 56 మి.మీ, పర్వతగిరి మండలం కల్లెడలో 56 మి.మీ, గీసుగొండ మండలం గొర్రెకుంటలో 55 మి.మీ, పర్వతగిరి మండలం ఏనుగల్‌లో 55 మి.మీ, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వానల ధాటికి కొన్ని చోట్ల వాహనాల రాకపోకలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారులపైనా ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజులు పాటు ఇదే మాదిరి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.🏙️🌧️

 
 
bottom of page