top of page

విద్యార్ధులకు 4 రోజులు సెలవులు.!🗓️🌧️

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా బుధవారం(జూలై 26), గురువారం(జూలై 27) అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ree

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా బుధవారం(జూలై 26), గురువారం(జూలై 27) అన్ని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. నెట్టింట మాత్రం వరుసగా 5 రోజులు సెలవులంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ‘జూలై 26, 27 వర్షాలు కారణంగా సెలవులు, 28 ఆప్షనల్ హాలీడే, 29న మొహర్రం సెలవు, 30న ఆదివారం.. వరుసగా 5 రోజులు సెలవులు’ అన్నది ఆ వార్త సారాంశం.ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. జూలై 28(మొహర్రం 9వ రోజు) ఆప్షనల్ హాలీడే, జూలై 29న మొహర్రం పబ్లిక్ హాలీడేగా ఉంది. ఇక్కడ జూలై 28న ఆప్షనల్ హాలీడే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది. 29న మొహర్రం హాలీడే స్కూళ్లకు వర్తిస్తుంది. ఇక 30న ఆదివారం. మరోవైపు విద్యార్ధులకు మాత్రం రెండు రోజులు కాదు.. ఏకంగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. 📅📚🏫


 
 
bottom of page