ఇకపై మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లు విదేశాల్లో?
- Shiva YT
- Mar 16, 2024
- 1 min read
ఏప్రిల్, మే నెలల్లో దశలవారీగా ఎన్నికలు ఉన్నందున ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి యూఏఈని ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు ఐపీఎల్ తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఐపీఎల్ ఈ నెల 22న చెన్నైలో ప్రారంభం కానుంది. తొలి దశలో ఏప్రిల్ 7 వరకు మ్యాచ్‌లు జరగనుండగా.. రెండో దశ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో రానుంది. 📅









































