🏏విండీస్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే వీడ్కోలు..🏝️
- Shiva YT
- Jul 20, 2023
- 1 min read
రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ నుంటి నుంచి అంటే జులై 20 అంటే గురువారం నుంచి మొదలుకానుంది. ఇదిలా ఉంటే భారత్‌కు చెందిన ఈ ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.🏆

ఈ జాబితాలో మొదటి పేరు భారత అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ఇషాంత్ గత 2 సంవత్సరాలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అతని కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. 2021లో చివరిసారిగా టీమిండియా తరపున ఆడిన ఇషాంత్ వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో భాగం కావడం లేదు. 34 ఏళ్ల వెటరన్ పేసర్ తన కెరీర్‌లో 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 311 వికెట్లు, వన్డేల్లో 115, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌కు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం లభించదనే చెప్పుకోవాలి. అయితే, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 🏏👋