top of page

🏏 ఇండియా vs వెస్టిండీస్ 🏝️

🇮🇳 India Playing XI vs WI: ఇండియా తరఫున మరో అరంగేట్రం ఖాయమేనా? రెండో టెస్టుకు తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా ఉండనుంది. కెప్టెన్ రోహిత్ చేసిన కామెంట్స్ చూస్తుంటే విన్నింగ్ కాంబినేషన్ లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 🏆 🇮🇳 India Playing XI vs WI: ఊహించినట్లే వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తొలి టెస్టులోనే అదరగొట్టేసింది. ఈ మ్యాచ్ తోనే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే రెండో టెస్టులో టీమ్ ఎలా ఉండబోతోంది? మరో ప్లేయర్ అరంగేట్రం ఖాయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 🤔 తొలి టెస్టులో యశస్వికి అవకాశం ఇచ్చినట్లే.. ఈ రెండో టెస్టులో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. గురువారం (జులై 20) నుంచి వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.


 
 
bottom of page