🏏 అర్ష్‌దీప్ పాంచ్ పటాకా.. మొదటి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు 🏏
- Suresh D
- Dec 18, 2023
- 1 min read
దక్షిణఫ్రికాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం (డిసెంబర్ 17) జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.🏏 🇮🇳
దక్షిణఫ్రికాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం (డిసెంబర్ 17) జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.🏏 🇮🇳మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 27.3 ఓవర్లలోనే 116 పరుగులకే కుప్ప కూలింది. టీమిండియా లెఫ్టార్మ్ సీమర్ అర్ష్ దీప్ సింగ్ ఐదు వికెట్లతో సఫారీల నడ్డీ విరిచాడు. మరో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతేడాతో విజయం సాధించిన రాహుల్ సేన మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన అర్ష్ దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.












































