top of page

భారత ఆర్థిక వృద్ధిలో కొత్త శకం.. ఆకాంక్ష నెరవేరే దిశగా ప్రయాణం..🌐📊

కరోనా ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థిక రంగంతో కుదేలయ్యాయి. ఆ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని దేశాలు నేటికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. సవాళ్లను పరిష్కరించడానికి మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టింది.

ree

కరోనా ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థిక రంగంతో కుదేలయ్యాయి. ఆ తరువాత మెల్లమెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో కొన్ని దేశాలు నేటికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కానీ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది. సవాళ్లను పరిష్కరించడానికి మోడీ ప్రభుత్వం అనేక సంస్కరణలను చేపట్టింది. దీంతో $2.7 ట్రిలియన్ల GDP తో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. భారతదేశం తన ఆర్థిక సవాళ్లను అధిగమించగలిగితే, దాని ఆర్థిక సంస్కరణలను నిలబెట్టుకోగలిగితే 21వ శతాబ్దంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగగల సామర్థ్యం భారతదేశానికి ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు. ఇటీవల, భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మక్కువ ఉన్న వారందరికీ ఆసక్తి కలిగించే రెండు తెలివైన పరిశోధనా భాగాలను తాను చూశానని తెలిపారు. ఒకటి SBI రీసెర్చ్ నుంచి మరొకటి ప్రముఖ జర్నలిస్ట్ అనిల్ పద్మనాభన్ నివేదిక అని తెలిపారు. ఈ విశ్లేషణలు మనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలను సూచిస్తున్నాయన్నారు. సమానమైన, సామూహిక శ్రేయస్సును సాధించడంలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని.. ఈ పరిశోధనల నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశం ఆర్థిక పురోగతి కొత్త శకంలో నిలుస్తోందని, 2047 నాటికి అభివృద్ధి చెందుతుంది అని ప్రధాని మోదీ అన్నారు 🌍🌐


 
 
bottom of page