అప్పుడే పుట్టిన ఏడుగురు శిశువులను చంపేసిన నర్సు
- Suresh D
- Aug 19, 2023
- 1 min read
ఆస్పత్రి నియోనాటల్ వార్డులో ఏడుగురు శిశువులను హత్య చేసి.. మరో పదిమందిని అంతం చేయడానికి ప్రయత్నించిన బ్రిటన్‌కు చెందిన నర్సు లూసీ లెట్బీ (33)ను యూకే కోర్టు దోషిగా నిర్దారించింది.

ఆస్పత్రి నియోనాటల్ వార్డులో ఏడుగురు శిశువులను హత్య చేసి.. మరో పదిమందిని అంతం చేయడానికి ప్రయత్నించిన బ్రిటన్‌కు చెందిన నర్సు లూసీ లెట్బీ (33)ను యూకే కోర్టు దోషిగా నిర్దారించింది. ఛెస్టర్ నగరంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛెస్టర్ కౌంటీ ఆస్పత్రిలో 2015 జూన్ - 2016 జూన్ మధ్యకాలంలో చోటుచేసుకున్న నవజాత శిశువుల మరణాలు యూకే చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో ఆస్పత్రి నియోనాటల్ వార్డులో నర్సుగా పనిచేసిన లూసీ లెట్బీ.. ఎనిమిది మంది శిశువుల్ని హత్య చేసి, మరో పది మందిని అంతం చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అరెస్టయి పలుసార్లు బెయిల్‌పై బయటకొచ్చిన లెట్బీని.. చెస్టర్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ కోర్టు దోషిగా తేల్చింది. నిందితురాలు లూసీ లెట్బీ.. అనారోగ్యంతో ఉన్న లేదా నెలలు నిండకుండానే పుట్టిన శిశులకు గాలితో ఇంజెక్ట్ చేయడం.. వారికి ఎక్కువ పాలు తాగించడం.. ఇన్సులిన్‌తో విషపూరితం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆస్పత్రి వైద్యుల్లో భారత సంతతి కన్సల్టెంట్ డాక్టర్ రవి జయరామ్ ఉన్నారు. దీనిపై జయరామ్











































