top of page

🚺🙅‍♂️ మూగ మహిళపై అత్యాచారం..

హైదరాబాద్ హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలోని విజయపురి కాలనీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మూగ, చెవిటి మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బాత్‌రూంలో బంధించి అత్యాచారం చేశాడు.

ree

హైదరాబాద్ హుమాయున్ నగర్ పీఎస్ పరిధిలోని విజయపురి కాలనీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మూగ, చెవిటి మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను బాత్‌రూంలో బంధించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.🏠 ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధిత మహిళను బాత్‌రూంలో బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన భర్త విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

🚓 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విజయ్ నగర్ కాలనీకి చెందిన మహిళ పుట్టుకతోనే మూగ, చెవిటి. ఆమె భర్త కూడా మూగవాడే. స్థానికంగా నివాసం ఉంటూ ఓ చిన్న చితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ మహిళపై వారి ఎదురింట్లో ఉండే సాయి అనే యువకుడు కన్నేశాడు. సమయం కోసం ఎదురు చూసిన సాయి.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాధిత మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆమెను బాత్ రూమ్ లో బంధించి అత్యాచారం చేశాడు.

 
 
bottom of page