రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
- Shiva YT
- Mar 26, 2024
- 1 min read
ఏపీలోని రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని విజయవాడ-చెన్నై మధ్య మూడో రైల్వే లైను పనులు జరుగుతున్నాయి. బిట్రగుంట-విజయవాడ మధ్య నడిచే (07977, 07978) రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 29 వరకు అవి పట్టాలెక్కవని అధికారులు తెలిపారు. అలాగే బిట్రగుంట-చెన్నై మధ్య నడిచే (17237, 17238) రైళ్లను ఈ నెల 31 వరకు రద్దు చేశారు.











































