top of page

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అతడేనా?

తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా కథను బలంగా చేసుకొని, దర్శకత్వ నైపుణ్యంతో అత్యంత ప్రతిభావంతమైన సినిమాలను తెరకెక్కిస్తోంది.

అలాగే పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. వీరిలో కొంతమంది ఏకంగా పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు. అయితే వీరి తర్వాత తరంలో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్నారు.

ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోవడమేకాదు.. అక్కడున్న ఖాన్ త్రయాన్ని కూడా పూర్తిగా వెనక్కి నెట్టేశాడు. ప్రస్తుతానికి భారతదేశంలో నెంబర్ వన్ స్టార్ హీరో ఎవరంటే అందరూ ముక్తకంఠంతో చెపుతున్న పేరు డార్లింగ్ ప్రభాస్ అని. అలాగే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒకరు గ్లోబల్ హీరోగా, మరొకరు పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page