నిమ్మకాయ తొక్కలు ఎంతలా ఉపయోగపడతాయో తెలిస్తే మీరు వాటిని బయటపడేయరు 😊
- Suresh D
- Feb 19, 2024
- 2 min read
నిమ్మకాయ రసం తీశాక తొక్కలను అందరూ బయట పడేస్తారు. నిజానికి వాటితో ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ తొక్కలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. 😊
నిమ్మ రసం తీశాక ఆ తొక్కలను బయటపడేసే వారే ఎక్కువ. నిజానికి నిమ్మరసం కన్నా ఆ నిమ్మకాయ తొక్కల్లోనే ఎన్నో పోషకాలు ఉన్నాయి. నిమ్మకాయ తొక్కలను ఒక దగ్గర భద్రపరిచి వాటితో ఇంటికి కావాల్సిన ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. 😊
తొక్కలో సహజంగానే ఆమ్లత్వం ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఇది అధిక ఆమ్లత్వం వల్ల శక్తివంతమైన స్ట్రెయిన్ రిమూవర్ గా పనిచేస్తుంది. మురికిని, జిడ్డును, ధూళిని త్వరగా పోగొడుతుంది. అలాగే నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజంగానే బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. కాబట్టి కటింగ్ బోర్డులు, ఇంట్లోని కౌంటర్ టాప్‌లు వంటి వాటిపై ఉన్న మరకలను తొలగించడానికి ఈ నిమ్మకాయలను వినియోగించవచ్చు. ఈ నిమ్మకాయలపై కాస్త ఉప్పు వేసి రుద్దితే ఎలాంటి మరకలు అయినా పోతాయి. 😊
నిమ్మకాయ తొక్క నుంచి మంచి సువాసన వస్తుంది. ఆ నిమ్మకాయ తొక్కలను తాజాగా ఉన్నప్పుడే సన్నగా తరుగుకోవాలి. ఆ తురుమును భద్రపరచుకొని వంటకాల్లో సలాడ్‌లపై, డిజర్ట్‌లపై వేసుకుంటే మంచి రుచి వస్తుంది. అయితే నిమ్మకాయ తొక్క తాజాగా ఉన్నప్పుడే వాటిని సన్నగా తురుముకోవడం చాలా ముఖ్యం. 😊
నిమ్మకాయ మంచి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. నిమ్మతొక్క పైన కాస్త వెనిగర్, బేకింగ్ సోడా చల్లి గిన్నెలు వంటివి శుభ్రపరచుకోవచ్చు. ఇది రసాయనాలు లేకుండానే త్వరగా మురికిని పోగొడుతుంది. తాజా సిట్రస్ వాసన వేసేలా చేస్తుంది. కాబట్టి దీంతో క్రిమిసంహారక మందులను తయారు చేసుకోవచ్చు. నిమ్మ తొక్కలను బేకింగ్ సోడాను, వెనిగర్ నీళ్లను వేసి ఒక బాటిల్ లో నానబెట్టండి. రాత్రంతా నానబెట్టాక ఉదయం లేచి మొక్కలపై చల్లితే మొక్కలపై ఉన్న చీడాపీడా వంటివి పోయే అవకాశం ఉంది. 😊
నిమ్మతొక్కలను ప్రమిదల్లా ఉపయోగించవచ్చు. పిండిన నిమ్మకాయలను లోపల కొవ్వొత్తి మిశ్రమాన్ని వేసి నిమ్మ కొవ్వొత్తి తయారు చేయవచ్చు. అలాగే కర్పూరం పొడి, నూనెలు వంటివి వేసి ప్రమిదల్లా వెలిగించవచ్చు. ఇవి దోమలను అరికడతాయి. ఇల్లంతా సువాసన వీచేలా చేస్తాయి. ఇది సహజ ఫ్రెష్‌నర్‌గా గదిలో ఉపయోగపడుతుంది. 😊
మీ సింకులు, వంటగది ప్లాట్‌ఫామ్‌లు క్లీన్ చేయడానికి ఈ నిమ్మకాయ తొక్కలో ఉపయోగపడతాయి. కాస్త బేకింగ్ సోడా, ఉప్పు వేసి ఈ నిమ్మ తొక్కలతో ప్లాట్ ఫామ్ ను రుద్దితే శుభ్రపడతాయి. దుర్గంధం, బొద్దింకలు వంటివి అక్కడ చేరకుండా ఉంటాయి. 😊
చెత్త పడేసే చోట ఈ నిమ్మకాయ తొక్కలను వేయడం వల్ల అక్కడ దుర్గంధం తక్కువగా వేస్తుంది. ఈ తొక్కలు అక్కడి వాసనను సువాసనగా మార్చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే మీరు డస్ట్ బిన్లు పెడతారో అక్కడ ఈ వాడిన నిమ్మకాయ తొక్కలను ఉంచడం అలవాటు చేసుకోండి. 😊
నిమ్మతొక్కలను కాస్త నీటిలో వేసి నానబెట్టండి. రెండు రోజులకు ఆ నీటిని స్ప్రే బాటిల్ లో వేయండి. ఇంట్లో మూలల్లో స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల దోమలు, ఇతర కీటకాలు దూరంగా ఉంటాయి. దోమలు అధికంగా ఉండే చోట ఇంట్లో స్రే చేస్తూ ఉండండి. దోమల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. 😊









































