సమ్మర్‌లో బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఒక్క గ్లాస్ ఇది తాగండి..🥥🩺
- Suresh D
- Feb 19, 2024
- 1 min read
బీపీ నియంత్రణకు కొబ్బరి నీళ్లు మంచిగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీరు దివ్య ఔషధం.
బీపీ నియంత్రణకు కొబ్బరి నీళ్లు మంచిగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ నీరు దివ్య ఔషధం. ఇటీవల జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా అధిక రక్తపోటు (బీపీ)తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. యువత కూడా బీపీ బారిన పడుతున్నారు. రక్తపోటు సాధారణంగా 120/90 కి దగ్గరగా ఉంటుంది. ఇది 140/90 దాటినప్పుడు అధిక రక్తపోటు అని అంటారు. బీపీ బాధితులు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీపీ ఉన్నవారు డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రాబోయే వేసవి కాలంలో మీ శరీరంలో తగినంత నీరు శాతం ఉండేలా జాగ్రత్త వహించాలని సూచించారు. ఇకపోతే బీపీ బాధితులకు కొబ్బరి నీళ్లు సూపర్ బెనిఫిట్స్ ఇస్తాయట. వీటిలో చాలా సహజమైన లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి. అవి బీపీ నియంత్రణకు ఉపయోగపడతాయి. బీపీ బాధితులు కొబ్బరినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణంగా మనం తినే కొన్ని ఆహారాల నుండి పొటాషియం లభిస్తుంది. కొబ్బరి నీళ్లలో కూడా పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం మూత్రం నుండి సోడియం, ఐరన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. సాధారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులలో సోడియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో సోడియం ఎక్కువైతే గుండెపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. అలాంటప్పుడు అధిక రక్తపోటు ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే వారి శరీరంలోని అదనపు సోడియం తొలగిపోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ సోడియం స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొబ్బరి నీటిలో 100 మి.లీకి 250 మి.గ్రా పొటాషియం ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటు ఉన్న రోగులకు చాలా మంచిది.
* కొబ్బరి నీరు రక్తనాళాలను శుభ్రపరచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది.
* అధిక బీపీ ఉన్నవారు రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అధిక మద్యపానం సేవించేవారు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లను తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. దీనికి లక్షణాలు ఉండవు. ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే, ఇది గుండె జబ్బులు, స్ట్రోకులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.🥥🩺









































