భారత్ vs న్యూజిలాండ్ థ్రిల్లింగ్ మ్యాచ్ హైలెట్స్ 🏏🏆
- Suresh D
- Nov 16, 2023
- 1 min read
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించి 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా 2019 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ..🏏🏆

కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. 12 ఏళ్లుగా టీమిండియా అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం ఎట్టకేలకు రానే వచ్చింది. ప్రపంచకప్ గెలవడానికి టీమ్‌ఇండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 70 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించి 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. తద్వారా 2019 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌లో కివీస్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు ధాటిగా ఆడింది. డారెల్ మిచెల్ భారీ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే షమీ సూపర్ స్పెల్ కు మిగతా కివీస్ బ్యాటర్లు దాసోహమయ్యారు. దీంతో 48.5 ఓవర్లలో 327 పరుగులు మాత్రమే చేయగలిగి 70 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్ధలయ్యాయి. విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. అలాగే ప్రపంచ కప్ వన్డే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ చేసిన 673 పరుగులే ఇప్పటివరకు రికార్డు. ఈ ప్రపంచకప్‌లో కింగ్ కోహ్లీ 711 పరుగులు చేయడం ద్వారా సచిన్‌ను దాటేశాడు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మరో హైలెట్ షమీ సూపర్ స్పెల్. ఇతర బౌలర్లు వికెట్లు తీయలేక భారీగా పరుగులు ఇస్తుంటే షమీ మాత్రం ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. మరి ఇన్ని విశేషాలున్న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను మీరు మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా హైలెట్స్ చూసేయండి.🏏🏆