top of page

ఈరోజు మిధునం, సింహం, తులా రాశులకు ధనలక్ష్మీ కటాక్షం..! మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...🔍 🔮

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి ఫలితాలు

మేష రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయడం వల్ల కొన్ని పనులను వాయిదా వేసుకోవచ్చు. ఈ కారణంగా మీ మనస్సులో కొంత గందరగోళం ఏర్పడుతుంది. వ్యాపారులకు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి వారి ఫలితాలు

వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. దీంతో మీ మనసులో కొంత నిరాశ ఎదురవుతుంది. అయితే మీరు మీ బాధ్యతలను సులభంగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు కొన్ని అదనపు పనులు చేయాల్సి ఉంటుంది. సీనియర్ల సలహాతో తమ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మిధున రాశి వారి ఫలితాలు

మిధున రాశి వారు ఈరోజు స్నేహితులు, బంధువులను కలవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ పనిని ఎవరికీ అప్పగించొద్దు. మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంగా వారు మీపై కోపం తెచ్చుకోవచ్చు. వారిని ఒప్పించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలలో కూడా పాల్గొనొచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు

కర్కాటక రాశి వారు ఈరోజు కుటుంబంలో ఏదైనా ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించి మాట్లాడాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఈరోజు తమ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే, దాని వల్ల మీకు భారీ లాభాలొస్తాయి. చిరు వ్యాపారులకు ఈరోజు నగదు కొరత ఏర్పడొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు

సింహ రాశి వారు ఈరోజు తమ పనులకు సంబంధించి ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ తల్లి ఆరోగ్యం క్షీణించొచ్చు. ఈ సమయంలో మీరు వైద్యుల సలహా తీసుకోవాలి. మరోవైపు మీ ప్రత్యర్థుల్లో కొందరు మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి వారి ఫలితాలు

కన్య రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధిస్తారు. మీరు మీ స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు మీకు ఇబ్బందులు కలిగించొచ్చు. విద్యార్థులు ఈరోజు విద్యా సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులా రాశి వారి ఫలితాలు

తులా రాశి వారు ఈరోజు కుటుంబంలో ఎవరితో అయినా వాగ్వాదం ఉంటే, దాన్ని మౌనంగా భరించడమే మంచిది. మీరు మీ తండ్రి మార్గదర్శకత్వంలో చేసే పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు చదువులో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. సమర్పించాలి. వృశ్చిక రాశి వారి ఫలితాలు

వృశ్చిక రాశి వారు ఈరోజు ఉపాధి కోసం చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు కొన్ని రంగాల్లో కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులు ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈరోజు మీకు మీ తల్లితో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. ఇది మీ కుటుంబ వాతావరణంలో అశాంతిని సృష్టించొచ్చు. ఈ సాయంత్రం నాటికి మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుల సహాయంతో వాటిని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు వ్యాపారంలో ఏదైనా రిస్క్ తీసుకుంటే, అది మీకు లాభదాయకంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు

ధనస్సు రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పొందుతారు. మీ పనిలో సహోద్యోగితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. తొందరపాటులో ఏ పనీ చేయకండి. ఈ కారణంగా మీరు కొంత నష్టాన్ని చవి చూడొచ్చు. వ్యాపారులు ఈరోజు ఆశించిన లాభాలను పొందుతారు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు.

మకర రాశి వారి ఫలితాలు

మకర రాశి వారు ఈరోజు తల్లిదండ్రులను సంతోష పెట్టడంలో కొంత ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ఊహించిన దాని కంటే మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే, ఈరోజు మీ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం మీరు కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లొచ్చు. కుంభ రాశి వారి ఫలితాలు

కుంభ రాశి వారు ఈరోజు చేసే కొన్ని కొత్త పనుల వల్ల తమ దినచర్యను మార్చుకోవాల్సి వస్తుంది. ఉద్యోగులు ఈరోజు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు. దీన్ని చూసి మీ శత్రువులు మీపై కోపం తెచ్చుకుంటారు. వారు మీ పనిని పాడు చేయటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది

మీన రాశి వారి ఫలితాలు

మీన రాశి వారు ఈరోజు కుటుంబ వాతావరణంలో ప్రశాంతంగా గడుపుతారు. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ సాయంత్రం మీరు మీ ప్రయాణంలో కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందొచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో కొన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

 
 
bottom of page