రాజమౌళి-మహేష్ సినిమాలో హృతిక్ రోషన్..🎥✨
- Suresh D
- Mar 20, 2024
- 1 min read
Updated: Mar 21, 2024
మహేష్ బాబుతో చేయబోతున్న తన కొత్త సినిమాపై డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి జపాన్‌లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం గురించి మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. మహేష్ బాబుతో చేసే సినిమా కోసం హృతిక్ రోషన్‌ను రాజమౌళి కలిశారట. ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో విలన్ రోల్ కోసం హృతిక్‌ను సంప్రదించారని టాక్. అయితే ఇది ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. మహేష్ సినిమాలో హృతిక్ నటిస్తే అద్భుతంగా ఉంటుందంటూ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. మరి వాళ్ల కోరిక తీరుతుందో లేదో చూడాలి.🎥✨