హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోలీసులు
- MediaFx

- Jul 16, 2024
- 1 min read
హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారు. ఈనెల 18 లోపు తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా... తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరోపై నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదు అయ్యింది. రాజ్‌తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయ్యింది. ఏ 1 గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రాన్ని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనను చంపేస్తామని బెదిరించి భయబ్రాంతులకు గురి చేసిన మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలో ఎప్‌ఐఆర్‌లో ముగ్గురి పేర్లను పోలీసులు చేర్చారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద ముగ్గురిపైనా కేసు నమోదు అయ్యింది.












































