top of page

మెదడు చురుకుగా పనిచేయడానికి అద్భుత ఆహారాలు 🥦🍎

ఉదయం చేసిన పనులు మధ్యాహ్నం నాటికి మరచిపోవటం, తరచుగా ఏదీ గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు మతిమరుపు వచ్చిందనడానికి సంకేతాలు.

నిజానికి మెదడు సరిగ్గా పని చేయకపోతే ఈ విధమైన జ్ఞాపక శక్తి రుగ్మతలు వస్తాయి. మన మెదడు దాదాపు 60 శాతం కొవ్వుతో తయారై ఉంటుంది. చాలా భాగం ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఒమేగా 3 మెదడు కణజాలం, నరాల కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం.. మెదడు, జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యం. అయితే మీ రోజువారీ ఆహారంలో ఏ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. కాఫీలో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే పచ్చి పసుపు కూడా జ్ఞాపకశక్తికి మంచి ఔషధం. 🍵

 
 
bottom of page